Tuesday, July 14, 2009

ఉద్రేకపరచే కామరసాయనాలు

phinaramones .........
ఫినరమోన్‌లు......

జంతుజాలంలో ఆడ,మగ మధ్య పరస్పర లైంగికావేశం, లైంగికోద్రేకం కలిగినపుడే వాటి నడుమ సంభోగం ఏర్పడుతుంది. ఫలితంగా సంతానం కలిగి తమ జాతి వృద్ధి చెందుతుంది. మానవులలో మాదిరి అందచందాల ఆకర్షణ జంతువులలో ఉండదు. అటువంటప్పుడు వాటిమధ్య లైంగికబంధం కలిగేందుకు ఏదేనీ హేతువు ఉండాలికదా! అందుకోసం ప్రకృతి చేసిన ఏర్పాటే కామరసాయనాలు!!

జీవరాశు లన్నింటిలోనూ ఉత్పత్తయ్యే ఈ రసాయనాలను ఫినరమోన్‌ లంటారు.ఆడ జంతువులు ఎదకొచ్చినపుడు వాటి మర్మావయ వాలలో ఈ ఫినరమోన్‌లు ఉత్పత్తవుతాయి. ఈ రసాయనాల వాసనకు మగ జంతువులు ఆకర్షింపబడి, లైంగికావేశానికి లోనవుతాయి. ఫలితంగా వాటిమధ్య సంభోగం కుదురుతుంది. చిత్తకార్తెలో కుక్కల సంభోగ దృశ్యాలు ప్రతి యేడాదీ మనకు కనిపించేదే! ఆడకుక్క వెనుక మగకుక్క తిరగటం,........ యోని వద్ద తరచూ వాసన చూస్తూ, లైంగికోద్రేకెం చెందటం జరుగుతుంది.ఈ కామరసాయనాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వీటికి విరుద్దమైన (లైంగిక వికర్షణ) ప్రభావాన్ని కలిగించే కృత్రిమ రసాయనాలను తయారు చేయగలిగారు. వీటిని ఉపయోగించి ఆడ కుక్కల జోలికి మగ కుక్కలు రాకుండా చేయగలుగు తున్నారు.
ఆడ జంతువులో విడుదల అయిన అండం ఫలదీకరణం చెందడంలోనూ ఫినరమోన్‌లు తగిన ప్రభావాన్ని కలిగిఉంటాయి

బుద్దిజీవులైన మానవులలో ఈ కామరసాయనాల అవసరం కనబడదు. వీరిలో లైంగికాకర్షణ ప్రధానంగా కంటిచూపులు, శారీరక స్పర్శ వలన కలుగుతుంది. జంతుజాలంలో సెక్సు కేవలం సంతాన సాధన కోసమే కాగా, మానవులు ఋతువులతో సంబంధం లేకుండా ఏ కాలంలో నైనా, సంతానోత్పత్తితో బాటు అనిర్వచనీయమైన సంభోగసౌఖ్యాన్నీ అనుభవించగలరు! పరిణామ క్రమంలో సర్వోన్నత స్థాయిని సాధించినప్పటికీ ఈ బుద్దిజీవులలో జంతుదశ కాలంనాటి పాత వాసనలింకా పోలేదనేందుకు వీరిలో ఉత్పత్తయ్యే ఫినరమోన్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి! వీటి అవసరం లేనప్పటికీ, స్త్రీలలో అండం విడుదల అయ్యే సమయంలో ఇవి తయారై, తరువాత తగ్గిపోతున్నట్టుగా పరిశోధకులు గమనించారు.

అమెరికాలోని హార్వర్ద్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని ఆశక్తికరమైన అంశాలు వెలుగుచూసాయి. హాస్టల్స్‌లో కలిసిఉండే మహిళల్లో కొంతకాలం తర్వాత ఋతుస్రావాలు సుమారుగా ఒకే సమయంలో ప్రారంభమౌతున్నట్టుగా కనుగొన్నారు. ఒకరి నెలసరి గురించి మరొకరికి తెలియకుండానే ఈ విశేషం చోటుచేసు కొంటోంది. ఎక్కువ కాలం కలిసి ఉండే మహిళల్లోనే ఇలా జరుగుతోంది. అలాగే మగవారితో చెట్టాపట్టాలేసుకు తిరిగే(మరీ అడ్వాన్సు కాకుండా) యువతుల్లోనూ ఋతుస్రావాలు కాస్త ముందుగా కలుగుతున్నాయి. వీరిలో ఉత్పత్తయ్యే ఫినరమోన్‌ల ప్రభావమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

1 comment:

  1. hello Sameeragaru,
    Im Vasudev from Brunei Darussalam, working as a lecturer in English in this small country.I belong to vizag. As part of my hobbied I develop my blog and read others. I liked your blog and the topics. Im looking forward to hearing from you and sharing opnioins and thoughts.More in my posting.
    Vasudev(pen name)

    ReplyDelete