Sunday, July 12, 2009

సెక్సు హార్మోనులు.....

kama rasayanalu....
'పిట్ట కొంచెం కూత ఘనం' అనే సామెత హార్మోనులకు చక్కగా సరిపోతుంది. వీటి పరిమాణం చాలా స్వల్పమే అయినప్పటికీ ఇవి చాలా పెద్దపెద్ద విధులను నిర్వర్తిస్తాయి. స్త్రీ, పురుషుల లింగభేదం ఏర్పడటానికీ, వారిలో శృంగార కోరికలు కలగటానికీ, సంతానోత్పత్తి ద్వారా వారి వంశాభివృద్ధి జరగడానికీ మూలాధారం వారిలోని సెక్సు హార్మోనులే !

సెక్సు హార్మోనులను స్టీరాయిడ్స్‌, పెప్టాయిడ్స్‌ అని రెండు రకాలుగా విభజించారు. సెక్సు కార్యాలకు సంబందించిన హార్మోనులు స్టీరాయిడ్స్‌ కాగా, పెప్టాయిడ్స్‌ అనేవి సంతానోత్పత్తికి సంబందించిన అవయవాలపై ప్రభావం చూపుతూనే, స్టీరాయిడ్స్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. స్టీరాయిడ్స్‌ హార్మోన్‌లలో ప్రధానమైనవి........ ఆండ్రోజెన్‌, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిన్‌ కాగా, వీటిలో ముఖ్యమైనవి టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రాడియోల్‌. ప్రొజెస్టిరాన్‌లు.
శరీరంలోని గొనాడ్స్‌ గ్రంధులలో స్టీరాయిడ్స్‌ ఉత్పత్తవుతాయి. వృషణాలు, అండాశయాలు, ఎడ్రినల్‌ కార్టెక్స్‌(కిడ్నీలపై టోపీలవలె నుండు భాగాలు)ల్లో ఈ గ్రంధులు ఉంటాయి.

ఇక సెక్సు కార్యాలకు సంబందించిన పెప్టయిడ్‌ హార్మోన్‌లు ఏమిటంటే.....
గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌(జి.ఆర్‌.ఎన్‌.హెచ్‌), ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌, ప్రొలాక్టిన్‌, ల్యుటినైజింగ్‌ హార్మోన్‌, మరియు పోస్టీరియర్‌ పిట్యూటరీ నుండి వచ్చే ఆక్సిటోసిన్‌.
గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ : మెదడు భాగంలోని హైపోథేలమస్‌లో తయారయ్యే ఈ హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి కోసం పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది.

ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ : మగవారిలో గ్రాఫియన్‌ ఫాలికిల్‌ పక్వమవడాన్ని ప్రేరేపిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభదశలో వినియోగపడుతుంది.
ప్రొలాక్టిన్‌ : స్తనముల నుండి క్షీరం ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ హార్మోన్‌ ఎక్కువైతే బీజాలు, అండాశయాలకు సంబందించిన బాధలు కలుగుతాయి.

ల్యుటినైజింగ్‌ హార్మోన్‌ : ఇది 3 ప్రధానమైన విధులను నిర్వహిస్తుంది. 1.మగవారిలో బీజాల్లోని ఇంటర్‌ స్టేషియల్‌ కణాలను ప్రేరేపించి టెస్టాస్టెరోన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
2.ఆడువారిలో కొలెస్ట్రాల్‌ నుండి ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ తయారయ్యేట్టు చేస్తుంది.
3.బీజాలు లేదా అండాశయాలకు రక్తప్రసారం పెరిగేట్టు చేస్తుంది.

ఆక్సిటోసిన్‌ : 1. పిట్యూటరీ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్‌ ప్రసవ సమయంలోగర్భాశయంలో కదలికలను ప్రేరేపిస్తుంది.
2. వక్షోజములలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
3. బావప్రాప్తి దశలో రక్తంలోదీని పరిమాణం పెరగుతుంది.ఆ సమయంలో జననావయాలు తీవ్ర సంకోచాలకు లోనుకావటానికి కారణమిదే! స్కలనమైన అరగంట తర్వాత రక్తంలో దీని పరిమాణం సాధారణ స్థాయికి చేరుకొంటుంది.
కామోద్రేక ఉద్దీపనలో ఈ హార్మోన్‌ పాత్ర కూడా ఉందని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు..........
(వచ్చే టపాలో మగ హార్మోనుల విశేషాల గురించి)

No comments:

Post a Comment