Friday, July 17, 2009

సెక్సు క్రోమోజోములు

సెక్సు క్రోమోజోములు .......

సజాతి ధృవాలు వికర్షించుకోవడం, విజాతి ధృవాలు ఆకర్షించుకోవడం అనే ఆయస్కాంత ధర్మాన్ని, ప్రకృతి భిన్న లింగధారులైన స్త్రీ, పురుషులకూ వర్తింపజేసింది. శారీరక, మానసిక స్థితి గతులలో వారి మధ్య గల తేడాలే స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణకు ఆలంబనగా, సృష్టి వికాసానికి మూలాధారంగా నిలుస్తున్నాయి. సంభోగంలో పురుషుని బీజకణం, స్త్రీ అండకణంంతో కలిసినపుడు పిండం ఏర్పడుతుంది. ఆ పిండం మగ లేదా ఆడగా రూపొందటంలో సెక్సు క్రోమోజోములు ప్రధానపాత్ర పోషిస్తాయి.

క్రోమోజోము అనగా ''రంగుపదార్ధం'' అని అర్ధం. క్రోమోజోములనే జీన్స్‌ అంటారు. పిల్లలకు తల్లిదండ్రుల నుండి సంక్రమించే వారసత్వ లక్షణాలు ఈ క్రోమోజోముల ద్వారానే బదిలీ అవుతాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు 1903వ సంవత్సరంలో కనుగొన్నారు. డ్రోసోఫీలియా అనే కీటకంపై జరిపిన ప్రయోగాలలో ఈ విషయం తొలిసారిగా బయటపడింది. మనిషిలో 46 క్రోమోజోము లుంటాయన్న సంగతి మాత్రం 1956 వరకూ స్పష్టం కాలేదు. అప్పటి వరకూ మనిషిలో 48 క్రోమోజోము లుంటాయని భావించేవారు. మానవుడు, వానరాలు మొదలైన ఉన్నతశ్రేణి జీవుల్లోనే అధిక సంఖ్యలో క్రోమోజోము లుంటాయని ఆనుకొనేవారు. కానీ వానరాల్లో 48, కోళ్లలో 78, ఎలుకల్లో 40 క్రోమోజోము లున్నాయని నిర్ధారణ జరిగాక, తమ అభిప్రాయాన్ని సరిదిద్దుకున్నారు.

మానవునిలోని 46 క్రోమోజోములూ వరుసగా, ఒకే సైజులో ఉండవు. 23 జంటలుగా అమరి ఉంటాయి. ఏ జంటకాజంట ఒకే తీరుగా ఉంటాయి.అయితే ఇక్కడో చిన్న తేడా ఉంది. స్త్రీలోని 23 జంటలూ ఒకే రకంగా ఉండగా, పురుషునిలోని 23వ జంట మాత్రం ఒకటి పొడవుగానూ, ంండవది పొట్టిగానూ ఉంటుంది.ఈ జంటనే సెక్సు క్రోమోజోము లంటారు. వీటిలోని పొడవుగా ఉన్నది ఆడ (ఎక్సు), పొట్టిగా ఉన్నది మగది (వై)గా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆడ-మగ తేడాలు ఈ క్రోమోజోముల వల్లనే ఏర్పడతాయి. ఎక్సు క్రోమోజోము ఆడ లక్షణాలను, వై క్రోమోజోము మగ శరీర ధర్మాలను ప్రసాదిస్తాయి.

1 comment: