Saturday, July 11, 2009

సెక్సు హార్మోన్లు ..... కామరసాయనాలు

తల్లి గర్భంనుండి జన్మించిన శిశువు ఆడ అయినా, మగ అయినా ఒకేలా కనిపిస్తుంది. జననాంగమును చూసినప్పుడే లింగ భేదం తెలుస్తుంది. పెరుగుతున్న కొద్దీ వారిలో ఆయా లింగభేదము ననుసరించి శారీరకమైన మార్పులు(అంతర్గతమైన మానసిక, ప్రజ్ఞాపాటవ గుణగణాలు కూడా) చోటుచేసుకొంటాయి.యుక్త వయసు రాగానే ఆ మార్పులు మరింత బాగా ప్రస్ఫుటిస్తాయి.స్త్రీకి ఆకర్షణీయమైన శరీరం, కోమలమైన కంఠస్వరం, మగవారి మతులు పోగొట్టే ఎద ఎత్తులు, గమ్మతైన జఘనం, నాజూకైన నడక స్వంతం కాగా, పొడవుగా ఎదిగిన శరీరం, బలమైన కండరాలు, గడ్డాలూ మీసాలతో మగవారి యవ్వనం జివ్వుమంటుంది.

స్తీ పురుషులకు ఆయా రూపాలు ఏర్పడటానికీ, వారిలో కామోద్రేకం కలగడానికి కారణం వారిలో ఉత్పత్తయ్యే సెక్సు హార్మోన్‌లే. వీటి మూలంగానే వారిలో ఆయా ఆకర్షణీయమైన శారీరక మార్పులూ ఏర్పడుతున్నాయి.
శరీరంలోని ఒకచోట నున్న గ్రంధులలో ఉత్పత్తయ్యి , దూరంగా మరోచోటనున్న నిర్ధిష్ట అవయవాలపై ప్రభావం చూపించే రసాయనాలనే హార్మోనులంటారు. హార్మోన్‌ అన్నది గ్రీకు భాషా పదం. ఈ పదానికి అర్ధం ' నేను ఉత్తేజ పరుస్తా' అని. హార్మోనులను ఆయా అవయవాలకు చేర్చేందుకు ఈ గ్రంధులు నాళములను కలిగి ఉండవు. అందుకే వీటిని వినాళ గ్రంధులని అంటారు.

ఈ గ్రంధులలో తయారైన హార్మోనులు రక్తంలో నేరుగా కలిసి ఆయా అవయవాలను చేరుకొంటాయి. శరీర కణాలలో జీవకార్య నిర్వహణ ఈ హార్మోన్‌ల నియత్రణలోనే జరుగుతుంది. వేర్వేరు హార్మోన్‌లు శరీరంలో ఆయా ప్రధానమైన పనులను నిర్వర్తిస్తాయి.శరీరంలో ఈ హార్మోనుల పరిమాణం ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉన్నా, లేదా తక్కువ ఉన్నా వ్యాధులు కలుగుతాయి. ఈ హార్మోనుల స్థాయిని నియంత్రించే వ్వవస్థను శరీరం సహజంగానే కలిగిఉంటుంది.

No comments:

Post a Comment