Saturday, July 18, 2009

ఆడ-మగ తేడాలు

ఆడ-మగ తేడాలు.......

పిండానికి 6వారాలు నిండే వరకూ ఆడా, మగా అన్న సంగతి స్పష్టం గాదు. ఒకేలా కనిపిస్తుంది.ఆడ శిశువైతే ఎక్స్‌ ఎక్స్‌ క్రోమోజోములు, మగ అయితే ఎక్స్‌ వై క్రోమోజోములు శరీరంలోని ప్రతి కణంలోనూ ఉంటాయి. ఈ దశలోనే జననావయాల మాతృక కణజాలం ఏర్పడుతుంది. వై క్రోమోజోము ఆ కణజాలంలో వృషణాల నిర్మాణాన్ని ప్రేరేపిస్తుంది. వై క్రోమోజోము పని కేవలం వృషణాల ఏర్పాటు చేసే వరకే!

పిండాన్ని మగ శిశువుగా రూపొందించే మొత్తం బాధ్యతను వృషణాలు చేపడతాయి. వృషణాలు టెస్టోస్టెరాన్‌ అనే హార్మోన్‌ను ఉత్పత్తిచేస్తాయి. పురుషాంగం, బీజకోశాల సృష్టితో బాటు, సంతానోత్పత్తికి అవసరమైయ్యే శుక్రకణాలను ఉత్పత్తి చేసే కణజాల నిర్మాణాన్నీ టెస్టాస్టెరోన్‌ సహాయంతో వృషణాలు నిర్వహిస్తాయి. పిండంలో అప్పటికే స్త్రీ జననేంద్రియ భాగాలూ మొగ్గతొడిగి ఉంటాయి. వృషణాలు తమ ప్రభావంతో ఆ భాగాలను క్షీణింప జేస్తాయి. దీనిని బట్టి పురుషాధిక్యత పిండదశలోనే ప్రారంభ మవుతున్నట్టుగా మనకు అర్ధమవుతోంది. అది ప్రకృతి సహజమని భావించాల్సి వస్తోంది.

పురుషునికి వృషణాల వంటి జననావయం స్త్రీకి అండాశయం. అయితే పిండం మగ శశువుగా మారేందుకు వృషణాలు ముందుగా ఏర్పడినట్టుగా ఆడశిశువులో అండాశయాలు ముందుగా తయారుకావు. 18 వారాల తర్వాత ఏర్పడతాయవి. 40 రోజుల పిండానికి ఆపరేషన్‌ చేసి వృషణాలను తొలగించగా, అది ఆడామగా కాకుండా లింగరహితంగా మారుతుందని భావించిన పిండశాస్త్ర పరిశోధకులకు ఆ పిండం ఆడపిల్లగా పెరగటం నివ్వెరపరిచింది ! పిండంలో వృషణాల ఉత్పత్తి జరగకపోతే అది సహజంగానే ఆడశిశువుగా ఎదుగు తుందని ఋజువైంది.

మగ శిశువులు కాంతికి బాగా ఆకర్షితులౌతారు. కంటికి నదురుగా కనిపించే వస్తువులు వారిని ఆకట్టు కుంటాయి. (ఈ ప్రభావమే వారు పెద్దవారయ్యాక అందమైన ఆడవారి పట్ల తొలి చూపులోనే ఆకర్షితులవటం, వారిని మోహించటానికీ కారణంగా కనిపిస్తోంది).

ఆడ శిశువులు ధ్వని, వాసనల ప్రభావానికి వేగంగా ప్రతిస్పందిస్తారు. (కంఠస్వరాలు, వివిధ ధ్వనులను గుర్తుపట్టటం, పలు రుచులను విశ్లేషించే అంశాలలో మగవారి కంటే ఆడవారు నిపుణత కలిగిఉంటారు). మానవ ముఖాలను చూడగానే ఆడశిశువులు ఆనందంతో కేరింతలు కొడతారు. మగశిశువులు నవ్వి ఊరుకొంటారు. ( సంతోషం, దుఃఖం మొదలైన ఫీలింగ్స్‌ వ్వక్తం చేసే విషయంలో మగవారు ఆడవారిలా భోళాగా ఉండరు. గుంభనంగా,గంభీరంగా ఉంటారన్న సంగతి గమనార్హం).

బాల్యదశలో ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువగా మరణిస్తారు. వ్యాధి నిరోధక శక్తి ఆ దశలో వారిలో తక్కువగా ఉంటుంది. రక్తనాళాల నిర్మాణం,హార్మోనుల తయారీ మగవారి కంటే ఆడువారిలో మెరుగ్గా, నాణ్యంగా ఉండటం వలన వ్యాధినిరోధక శక్తి వారిలో అధికంగాఉంటుంది. మగపిల్లలు ఎక్కువగా మరణిస్తే లోకంలో ఆడ జనాభా అధికంగా పెరిగి పోవాలి కదా! మరి అలా జరగటం లేదెందుకని.......?
ఎందుకంటే.......
ఆడువారి కంటే పురుష జననాలు ఎక్కువ ఉండేలా చేస్తూ ప్రకృతి స్త్రీ, పురుషుల నిష్పత్తిలో సమతుల్యత సాధిస్తోంది కాబట్టి!

Friday, July 17, 2009

సెక్సు క్రోమోజోములు

సెక్సు క్రోమోజోములు .......

సజాతి ధృవాలు వికర్షించుకోవడం, విజాతి ధృవాలు ఆకర్షించుకోవడం అనే ఆయస్కాంత ధర్మాన్ని, ప్రకృతి భిన్న లింగధారులైన స్త్రీ, పురుషులకూ వర్తింపజేసింది. శారీరక, మానసిక స్థితి గతులలో వారి మధ్య గల తేడాలే స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణకు ఆలంబనగా, సృష్టి వికాసానికి మూలాధారంగా నిలుస్తున్నాయి. సంభోగంలో పురుషుని బీజకణం, స్త్రీ అండకణంంతో కలిసినపుడు పిండం ఏర్పడుతుంది. ఆ పిండం మగ లేదా ఆడగా రూపొందటంలో సెక్సు క్రోమోజోములు ప్రధానపాత్ర పోషిస్తాయి.

క్రోమోజోము అనగా ''రంగుపదార్ధం'' అని అర్ధం. క్రోమోజోములనే జీన్స్‌ అంటారు. పిల్లలకు తల్లిదండ్రుల నుండి సంక్రమించే వారసత్వ లక్షణాలు ఈ క్రోమోజోముల ద్వారానే బదిలీ అవుతాయి. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు 1903వ సంవత్సరంలో కనుగొన్నారు. డ్రోసోఫీలియా అనే కీటకంపై జరిపిన ప్రయోగాలలో ఈ విషయం తొలిసారిగా బయటపడింది. మనిషిలో 46 క్రోమోజోము లుంటాయన్న సంగతి మాత్రం 1956 వరకూ స్పష్టం కాలేదు. అప్పటి వరకూ మనిషిలో 48 క్రోమోజోము లుంటాయని భావించేవారు. మానవుడు, వానరాలు మొదలైన ఉన్నతశ్రేణి జీవుల్లోనే అధిక సంఖ్యలో క్రోమోజోము లుంటాయని ఆనుకొనేవారు. కానీ వానరాల్లో 48, కోళ్లలో 78, ఎలుకల్లో 40 క్రోమోజోము లున్నాయని నిర్ధారణ జరిగాక, తమ అభిప్రాయాన్ని సరిదిద్దుకున్నారు.

మానవునిలోని 46 క్రోమోజోములూ వరుసగా, ఒకే సైజులో ఉండవు. 23 జంటలుగా అమరి ఉంటాయి. ఏ జంటకాజంట ఒకే తీరుగా ఉంటాయి.అయితే ఇక్కడో చిన్న తేడా ఉంది. స్త్రీలోని 23 జంటలూ ఒకే రకంగా ఉండగా, పురుషునిలోని 23వ జంట మాత్రం ఒకటి పొడవుగానూ, ంండవది పొట్టిగానూ ఉంటుంది.ఈ జంటనే సెక్సు క్రోమోజోము లంటారు. వీటిలోని పొడవుగా ఉన్నది ఆడ (ఎక్సు), పొట్టిగా ఉన్నది మగది (వై)గా శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆడ-మగ తేడాలు ఈ క్రోమోజోముల వల్లనే ఏర్పడతాయి. ఎక్సు క్రోమోజోము ఆడ లక్షణాలను, వై క్రోమోజోము మగ శరీర ధర్మాలను ప్రసాదిస్తాయి.

Thursday, July 16, 2009

ఎండార్ఫిన్స్‌

ఎండార్ఫిన్స్‌ .......

సంభోగ సమయంలో మెదడులో ఒక రకమైన రసాయనములు ఉత్పత్తవుతాయి. నల్లమందు వలే ఉత్తేజకరమైన మత్తును కలిగించే ఈ రసాయనములను ఎండార్ఫిన్స్‌ అంటారు. భావప్రాప్తి దశలో వీటి ఉత్పత్తి జరుగుతుంది.

1.నిద్ర కలిగించడం, 2. నొప్పులను తగ్గించడం ఇవి నిర్వహించే పనులు. సంభోగం తదనంతరం హాయిగా నిద్రపోవాలనిపించడం ఎండార్ఫిన్స్‌ మహత్యమే! అలాగే కీళ్ళనొప్పుల సమస్యతో బధపడేవారు తరచూ రతిలో పాల్గొంటుంటే ఆ నెప్పుల నుండి ఉపశమనం కలుగుతు న్నట్టుగా వెల్లడైంది. ఈ విషయంలోనూ ఎండార్పిన్సే సహకరిస్తున్నాయని పరిశోధకులంటున్నారు.

సంభోగ సమయంలోనే కాకుండా, ప్రశాంత చిత్తంతో ధ్యానం కొనసాగినప్పుడూ మెదడులో ఎండార్ఫిన్స్‌ విడుదల జరుగుతోందని నిర్ధారణ జరిగింది.

ఫినరమోన్లు

phinaramones ..........

రతి కార్యక్రమంలో భాగంగా కొంతమంది తీవ్ర ఉద్రేకంతో స్త్రీ జననేంద్రియాన్ని నాలుకతో నాకుతుంటారు. గాఢమైన మోహావేశానికి లోనైన సందర్భంలో కొందరు స్త్రీలు కూడా పురుషుని జననాంగమును నోట్లో పెట్టుకొని గీరుతుంటారు. 'కన్నిలిగ్నస్‌' గా పిలిచే ఈ రకమైన లైంగికచర్యకు ప్రేరణ ఫినరమోన్‌ల ఆకర్షణే అని తెలుస్తోంది.

ఫినరమోన్‌ల ఉత్పత్తి మగవారిలోనూ ఉంటుందని ఇటీవల జరిగిన పరిశోధనలో నిర్ధారించ బడింది. పురుషుల బాహు మూలలలోని చెమటలో అంతర్గతంగా ఉండే ఆ రసాయనాల వాసన స్త్రీలను ఎంతగానో ఆకర్షిస్తుందని ఫిలడెల్పియాలోని మోనెల్‌ కెమికల్‌ సెన్సస్‌ సెంటర్‌ పరిశోధకులు గుర్తించారు. (కస్తూరి వంటి కొన్ని జంతువులలో కూడా మగవి కామరసాయనాల(కస్తూరి)ను ఉత్పత్తి చేసి, ఆడవాటిని ఆకర్షించడం ఉంది) చెమట పరిమళాన్ని బట్టి మహిళలకు ఆయా పురుషులపై యిష్టత ఏర్పడుతుందని ఈ పరిశోధనలో తేలింది. తమ అధ్యయనం కోసం ఎంపిక చేసిన మహిళలు ఈ విషయాన్ని అంగీకరించారు.

మగవారి చెమటలోని ఫినరమోన్స్‌ స్త్రీలలో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.అయితే ఇక్కడొక విషయంగుర్తుంచుకోవాలి. ..... వ్యక్తిగత పరిశుభ్రత లేనప్పుడు మాత్రం ఈ సువాసనే చెమటకంపుగా మారి, స్త్రీలకు ఆ మగవానిపై ఒళ్ళు మండేలా చేస్తుందని కూడా అదే అధ్యనంలో బయటపడింది.( ఫినరమోన్‌ల వాసనను పోలిన సెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి).

కామరసాయనాల వాసనలు పసిగట్టే విషయంలో ఆడవారు మగవారి కంటే ముందుంటారు. వారి శరీరంలో తయారయ్యే ఈస్ట్రోజెన్‌ వారిలోని ఈ వాసనలను విశ్లేషించే నిపుణతకు కారణంగా కనుగొన్నారు. ఈస్త్రోజెన్‌ను ఇంజెక్షన్‌ ద్వారా పురుషులకు ఇచ్చినపుడు వారు కూడా కామరసాయనాలను తేలికగా గుర్తించటం జరిగింది.

Tuesday, July 14, 2009

ఉద్రేకపరచే కామరసాయనాలు

phinaramones .........
ఫినరమోన్‌లు......

జంతుజాలంలో ఆడ,మగ మధ్య పరస్పర లైంగికావేశం, లైంగికోద్రేకం కలిగినపుడే వాటి నడుమ సంభోగం ఏర్పడుతుంది. ఫలితంగా సంతానం కలిగి తమ జాతి వృద్ధి చెందుతుంది. మానవులలో మాదిరి అందచందాల ఆకర్షణ జంతువులలో ఉండదు. అటువంటప్పుడు వాటిమధ్య లైంగికబంధం కలిగేందుకు ఏదేనీ హేతువు ఉండాలికదా! అందుకోసం ప్రకృతి చేసిన ఏర్పాటే కామరసాయనాలు!!

జీవరాశు లన్నింటిలోనూ ఉత్పత్తయ్యే ఈ రసాయనాలను ఫినరమోన్‌ లంటారు.ఆడ జంతువులు ఎదకొచ్చినపుడు వాటి మర్మావయ వాలలో ఈ ఫినరమోన్‌లు ఉత్పత్తవుతాయి. ఈ రసాయనాల వాసనకు మగ జంతువులు ఆకర్షింపబడి, లైంగికావేశానికి లోనవుతాయి. ఫలితంగా వాటిమధ్య సంభోగం కుదురుతుంది. చిత్తకార్తెలో కుక్కల సంభోగ దృశ్యాలు ప్రతి యేడాదీ మనకు కనిపించేదే! ఆడకుక్క వెనుక మగకుక్క తిరగటం,........ యోని వద్ద తరచూ వాసన చూస్తూ, లైంగికోద్రేకెం చెందటం జరుగుతుంది.ఈ కామరసాయనాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు వీటికి విరుద్దమైన (లైంగిక వికర్షణ) ప్రభావాన్ని కలిగించే కృత్రిమ రసాయనాలను తయారు చేయగలిగారు. వీటిని ఉపయోగించి ఆడ కుక్కల జోలికి మగ కుక్కలు రాకుండా చేయగలుగు తున్నారు.
ఆడ జంతువులో విడుదల అయిన అండం ఫలదీకరణం చెందడంలోనూ ఫినరమోన్‌లు తగిన ప్రభావాన్ని కలిగిఉంటాయి

బుద్దిజీవులైన మానవులలో ఈ కామరసాయనాల అవసరం కనబడదు. వీరిలో లైంగికాకర్షణ ప్రధానంగా కంటిచూపులు, శారీరక స్పర్శ వలన కలుగుతుంది. జంతుజాలంలో సెక్సు కేవలం సంతాన సాధన కోసమే కాగా, మానవులు ఋతువులతో సంబంధం లేకుండా ఏ కాలంలో నైనా, సంతానోత్పత్తితో బాటు అనిర్వచనీయమైన సంభోగసౌఖ్యాన్నీ అనుభవించగలరు! పరిణామ క్రమంలో సర్వోన్నత స్థాయిని సాధించినప్పటికీ ఈ బుద్దిజీవులలో జంతుదశ కాలంనాటి పాత వాసనలింకా పోలేదనేందుకు వీరిలో ఉత్పత్తయ్యే ఫినరమోన్‌లే సాక్ష్యంగా నిలుస్తున్నాయి! వీటి అవసరం లేనప్పటికీ, స్త్రీలలో అండం విడుదల అయ్యే సమయంలో ఇవి తయారై, తరువాత తగ్గిపోతున్నట్టుగా పరిశోధకులు గమనించారు.

అమెరికాలోని హార్వర్ద్‌ యూనివర్సిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో కొన్ని ఆశక్తికరమైన అంశాలు వెలుగుచూసాయి. హాస్టల్స్‌లో కలిసిఉండే మహిళల్లో కొంతకాలం తర్వాత ఋతుస్రావాలు సుమారుగా ఒకే సమయంలో ప్రారంభమౌతున్నట్టుగా కనుగొన్నారు. ఒకరి నెలసరి గురించి మరొకరికి తెలియకుండానే ఈ విశేషం చోటుచేసు కొంటోంది. ఎక్కువ కాలం కలిసి ఉండే మహిళల్లోనే ఇలా జరుగుతోంది. అలాగే మగవారితో చెట్టాపట్టాలేసుకు తిరిగే(మరీ అడ్వాన్సు కాకుండా) యువతుల్లోనూ ఋతుస్రావాలు కాస్త ముందుగా కలుగుతున్నాయి. వీరిలో ఉత్పత్తయ్యే ఫినరమోన్‌ల ప్రభావమే ఇందుకు కారణంగా భావిస్తున్నారు.

ఆడ సెక్సు హార్మోనులు

female sex hormones .........

ఆడ సెక్సు హార్మోనుల్లో ప్రధానమైనది ఈస్ట్రోజెన్‌. ఇది అండాశయాలలో తయారవుతుంది. స్త్రీ రజస్వల అయ్యే
వయసులో ఈ హార్మోన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

పిట్యూటరీ గ్రంధిలో తయారయ్యే గొనాడోట్రోఫిన్‌ రసాయనం అండాశయాలలోని ఈ హార్మోను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ హార్మోను ప్రభావం వలన స్త్రీకి మర్మాంగం,చంకల్లో వెంట్రుకలు పెరగటం,మర్మాంగం దాని ఇతర భాగాలలో వికాసం, వక్షోజాలు వృద్ధి చెందడం మొదలైన శారీరక మార్పులు కలుగుతాయి.
కామపరమైన ఊహలూ, వాంఛలూ పెరుగుతాయి.

ఈ హార్మోనుల ఉత్పత్తి జరగకపోతే ఆడపిల్ల రజస్వల కాలేదు. యోని, వక్షోజాలు వికాసం చెందకుండా చిన్నవిగానే ఉండిపోతాయి. ఆమెలో సెక్సు కోరికలు కూడా ఉండవు.

మగవారి మూత్రపిండాలలో ఆడ సెక్సు హార్మోన్‌లు తయారైనట్టుగా, ఆడువారిలోనూ మగసెక్సు హార్మోన్‌ల(వీటిలో ప్రధానమైనది టెస్టాస్టిరోన్‌) ఉత్పత్తి జరుగుతుంది. ఇవి మూత్రపిండాలపై ఉండే ఎడ్రినల్‌ కార్టెక్స్‌లో తయారవుతాయి. ఏదేనీ కారణంగా ఎడ్రినల్‌ కార్టెక్స్‌లో ఈ హార్మోనులు అధికంగా విడుదలైతే మాత్రం వారిలో పురుష లక్షణాలు మొగ్గ తొడుగుతాయి.కండలతో కూడిన శరీరము,గంభీరమైన స్వరం, ఒంటినిండా వెంట్రుకలతో మగరాయుడిలా కనిపిస్తారు.

Monday, July 13, 2009

నపుంసకత్వం

నపుంసకత్వం........

సెక్సు హార్మోనుల ఉత్పత్తి అస్సలు లేకపోవటం మగవారిలో నపుంసకత్వానికి దారితీస్తుంది. ఫలితంగా పురుషాంగం, వృషణాలలో పెరుగుదల లోపించి చిన్న పిల్లల్లో మాదిరిగా కనిపిస్తాయి. ఉపలైంగిక లక్షణాలైన గడ్డాలు,మీసాలు, ఫ్యూబిక్‌ హెయిర్‌ తయారుకావు. జన్యుపరమైన లోపాలు (వారసత్వంగా సంక్రమించే దోషాలు), పుట్టుకతోనే వృషణాలలో ఏర్పడిన సమస్యలు, వృషణాలలో క్షయ రోగం వ్యాపించటం, గడ్డలు పెరగటం, గనేరియా, సిఫిలిస్‌ వంటి సుఖరోగాల ప్రభావం వలన వృషణాలు చైతన్య రహితంగా తయారు కావటం మొదలైన కారణాల మూలంగా సెక్సు హార్మోనుల ఉత్పత్తిని నిరోధింపబడి నపుంసకత్వం ప్రాప్తిస్తుంది.

కొంతమందిలో అరుదుగా చిన్న వయసులోనే ఈ సెక్సు హార్మోనులు(ముఖ్యంగా టెస్టాస్టిరోన్‌) అదుపుతప్పి అధికంగా ఉత్పత్తి కావటం జరుగుతుంది. అందువలన విచిత్రమైన పరిస్థితి వారిలో దాపురిస్తుంది. పురుషాంగం భారీగా తయారుకావటం, విపరీతమైన సెక్సు కోరికలు కలిగిఉండటం, పెద్దవారిలా ప్రవర్తించటం మొదలైన లక్షణాలు ఏర్పడతాయి. వీరిలో హార్మోనుల చికిత్స చేయించటం ద్వారా పరిస్థితిని సరిదిద్దవచ్చు!

మానసిక కారణాల వలన కూడా కొంతమంది నపుంసకులుగా తయారవుతారు.అతిగా హస్త్తప్రయోగం చేసుకోవటం వలన, రతి సామర్ధ్యం పోతుందని,అందువలన స్త్రీతో సంభోగానికి పనికిరాననే ఆధారం లేని భయాలు,అపోహలు కలిగిఉండటం, తన జననాంగం చిన్నదిగా ఉన్నదని..... అందుచేత స్త్రీని సుఖపెట్టలేనని భావించటం,
ఇతర సెక్సు పరమైన అంశాల పట్ల అవగాహనా రాహిత్యం మొదలైన కారణాల వలన శారీరకమైన లోపాలేవీ లేకపోయినప్పటికీ నపుంసకులుగా మారతారు. ఇటువంటి వారిలో కొంతమంది హస్తప్రయోగం చక్కగా చేసుకొంటారు, స్త్రీతో సంభోగం విషయంలో మాత్రం ఫెయిలవుతారు. తమది మానసిక లోపమే గాని, శారీరక సమస్య కాదని గ్రహించలేక బాధపడు తుంటారు. ఇటువంటి మానసిక సమస్యలకు సెక్సాలజిస్టుతో జరిపే కౌన్సిలింగ్‌ వలన సులభంగా పరిష్కారం దొరుకుతుంది.

Sunday, July 12, 2009

మగ సెక్సు హార్మోన్‌లు

male sex hormones ........
మగ సెక్సు హార్మోన్‌లు......

మగవారి శృంగార జీవితాన్ని వెలిగించే అతి ముఖ్యమైన హార్మోన్‌ టెస్టాస్టిరోన్‌. పిండస్థ దశ నుండే ఈ హార్మోన్‌ ప్రభావం మొదలవుతుంది. ఇది బాహ్య మరియు అంతర్గత పురుష జననావయాల సృష్టికి తోడ్పడుతుంది.యవ్వన విలాసాల రూపకల్పనలోనూ ఈ హార్మోన్‌ పాత్ర అద్భుతం!

వృషణాలలోని ఓ ప్రత్యేక కణజాలంలో తయారయ్యే ఈ హార్మోన్‌ సంతాన సాఫల్యానికి అవసరమైన బీజకణాలను రూపొందించటం, పురుషత్వాన్ని కలిగించే ఉత్ప్రేరకాలను ఉత్పత్తి చేయటం అను రెండు ప్రధాన బాధ్యతలు నిర్వర్తిస్తుంది.కేంద్ర నాడీమండలంపై టెస్టోస్టిరోన్‌ ప్రత్యక్ష ప్రభావం కలిగి ఉంది. వృషణాలలో ఉత్పత్తయ్యే ఈ హార్మోన్‌ను మెదడులోని హైపోథాలమస్‌ కేంద్రం నియంత్రిస్తుంది.
హైపోథాలమస్‌లో తయారయ్యే గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ (జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌), పిట్యూటరీ గ్రంధిలోని లాసోఫిలిక్‌ కణాలను ప్రేరేపించి, ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ ఉత్పత్తి అయ్యేటట్లు చేస్తుంది. ఈ హార్మోను బీజ కణజాలాన్ని ప్రభావితం చేసి టెస్టోస్టిరాన్‌ తయారయేటట్లు చేస్తుంది.

నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం : వృషణాలలో టెస్టాస్టిరాన్‌ తగినంతగా తయారు కాగానే, ఇది హైపోథాలమస్‌పై పనిచేసి జి.ఎన్‌.ఆర్‌.హెచ్‌ ఉత్పత్తి తగ్గేటట్లు చేస్తుంది. దాంతో ల్యూటినైజింగ్‌ హార్మోన్‌ పరిమాణమూ పడిపోతుంది.దీనినే నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌ మెకానిజం అంటారు.

శరీరంలోని మొత్తం టెస్టోస్టిరాన్‌లో కేవలం 5% మాత్రమే స్వచ్ఛంగా(ఫ్రీ టెస్టోస్టిరాన్‌) ఉంటుంది. 35-60% హార్మోన్‌ బైండింగ్‌ గ్లోబ్యులిన్‌ తో కలిసి ఉంటుంది.ఇది అవయవాలపై ఏ విధమైన ప్రభావమూ చూపలేదు.స్టోరేజ్‌గా ఉండటానికి పనికొస్తుంది. మరో 40-70% అల్బుమిన్‌తో లూజ్‌గా కలిసి ఉంటుంది.ఇది మాత్రం కణాలకు అందుబాటులో ఉంటుంది. ఫ్రీ టెస్టాస్టిరోన్‌, అల్బుమిన్‌తో కలిసినదీ కలిపి 'బయో అవైలబిలిటీ టెస్టాస్టిరోన్‌' అంటారు.

టెస్టాస్టిరోన్‌ పరిమాణం దినమంతా ఒకే విధంగా ఉండదు. గాఢనిద్రా సమయంలోనూ, తెల్లవారు జామున ఎక్కువగా ఉంటుంది. ఆ సమయాల్లో మనకు తెలియకుండానే అంగస్థంభనలు కలుగుతుంటాయి. తెల్లవారు జామున సెక్స్‌ ఎక్కువగా కలగటానికి కూడా కారణమిదే! రోజు మొత్తంమీద చూస్తే 6-7 సార్లు టెస్టాస్టిరోన్‌ కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. వీర్యం,వీర్యకణాల ఉత్పత్తిలో టెస్టాస్టిరోన్‌ పాత్ర ప్రత్యక్షంగానూ, భావప్రాప్తి
విషయంలో ఎక్కువగా పరోక్షంగానూ ఉంటుంది.

పందులను పెంచేవారు అవి బలిష్టంగా ఎదిగేందుకు, పిల్లలుగా ఉన్నప్పుడే వాటి వృషణాలను తొలగించివేస్తారు.అలా చేయటం వలన వాటిలో టెస్టాస్టిరోన్‌ పరిమాణం పడిపోతుంది. ఫలితంగా వాటికి సంభోగంపై కోరిక నశిస్తుంది. అంగస్తంభన సామర్థ్యాన్నీ కోల్పోతాయి.
మనుషుల్లో వృషణాలు వ్యాధిగ్రస్తమై చెడిపోయినా, కావాలని వాటిని తొలగించినా టెస్టాస్టిరోన్‌ ఉత్పత్తి నిలిచిపోయి,ఆడ సెక్సు హార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌ (ఇది మగవారిలోనూ ఉంటుంది, అయితే మగసెక్సు హార్మోన్‌ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ హార్మోన్‌ ప్రభావం అంతగా ఉండదు. వీర్య కణాలను పరిపక్వం చేసే విషయంలో ఈ ఆడ సెక్సు హార్మోన్‌ ఉపయోగ పడుతుంది) ప్రభావం అధికమవుతుంది. ఫలితంగా ఆ వ్యక్తిలో పురుషత్వం పోయి, ఆడ లక్షణాలు కనిపిస్తాయి. (బొంబాయి,ఢిల్లీ వంటి చోట్ల పిల్లలను ఎత్తుకు పోయే ముఠాల వారు వృషణాలను తొలగించి వారిని కొజ్జాలుగా మార్చి వారితో వ్యాపారం సాగిస్తారు)

మన ప్రమేయం లేకుండా జరిగే అంగస్తంభనాలకు టెస్టాస్టిరోన్‌ అత్యంత అవసరమైనప్పటికీ బ్లూఫిల్ములు చూసినప్పుడు, స్త్రీ స్పర్ష తగిలినపుడు కలిగే అంగస్తంభనాలలో మాత్రం ఈ హార్మోన్‌ పాత్ర చాలా స్వల్పమేనని అధ్యయనాల ద్వారా వెల్లడైంది.అయితే మనిషిలో కలిగే సెక్సు కోరికలు,సెక్సు సామర్థ్యం ఈ హార్మోన్‌పైనే ఆధారపడి ఉంటాయి.
మరో విచిత్రమైన విషయమేంటంటే ......పురుష జననాంగ సృష్టిని ప్రేరేపించేది ఆడ సెక్సు హార్మోనులు(ఈస్ట్రోజెన్‌) కావటం! తల్లి గర్భంలో ఉండగా మగ శిశువు జననాంగం ఏర్పడటంలో తల్లిలో తయారయ్యే స్త్రీ సెక్సు హార్మోన్‌ అయిన ఈస్ట్రోజెన్‌ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.వృషణాలలోని టెస్టోస్టెరోన్‌ ప్రభావంతో యుక్తవయసులో మగవారిలో పురుషత్వాన్ని ప్రస్ఫుటించే గడ్డాలు,మీసాలు ఏర్పడతాయి. పురుషాంగం వద్ద, చంకల్లోనూ వెంట్రుకలు (ఫ్యూబిక్‌ హెయిర్‌) మొలుస్తాయి. వృషణాలు, పురుషాంగంలో పెరుగుదల కనిపిస్తుంది. యుక్తవయసులో మగవారి ఎముకలు,కండరాలలో ఎదుగుదల వేగం పుంజుకోవటానికీ కారణం ఈ సెక్సు హార్మోనే!

కొందరిలో పురుష లక్షణాలు పుష్కలంగా ఉన్నప్పటికీ గడ్డాలు, మీసాలు పెరగక బాధపడుతుంటారు. వారిలో సెక్సు హార్మోనుల ఉత్పత్తి జరుగుతు న్నప్పటికీ గడ్డాలు,మీసాలు ఎందుకు పెరగటం లేదో అర్ధం గావటంలేదు. ఈ సమస్యకు ప్రత్యేకమైన మందులంటూ ఏవీ లేవు.

సాధారణంగా సెక్సు హార్మోన్‌ల ఉత్పత్తి లోపిస్తే మగవారిలో వీర్యకణాల ఉత్పత్తి జరగదు. అయితే కొందరిలో ఈ హార్మోనుల ఉత్పత్తి సవ్యంగానే ఉన్నప్పటికీ శారీరకమైన సమస్యలు (వృషణాలు అధిక వేడికి గురి కావటం,వీర్యకణాల ఉత్పత్తి జరిగే కణజాలంలో సమస్యలు మొదలైనవి) కారణంగా వీర్యలోపాలు కలగవచ్చు.

సెక్సు హార్మోనులు.....

kama rasayanalu....
'పిట్ట కొంచెం కూత ఘనం' అనే సామెత హార్మోనులకు చక్కగా సరిపోతుంది. వీటి పరిమాణం చాలా స్వల్పమే అయినప్పటికీ ఇవి చాలా పెద్దపెద్ద విధులను నిర్వర్తిస్తాయి. స్త్రీ, పురుషుల లింగభేదం ఏర్పడటానికీ, వారిలో శృంగార కోరికలు కలగటానికీ, సంతానోత్పత్తి ద్వారా వారి వంశాభివృద్ధి జరగడానికీ మూలాధారం వారిలోని సెక్సు హార్మోనులే !

సెక్సు హార్మోనులను స్టీరాయిడ్స్‌, పెప్టాయిడ్స్‌ అని రెండు రకాలుగా విభజించారు. సెక్సు కార్యాలకు సంబందించిన హార్మోనులు స్టీరాయిడ్స్‌ కాగా, పెప్టాయిడ్స్‌ అనేవి సంతానోత్పత్తికి సంబందించిన అవయవాలపై ప్రభావం చూపుతూనే, స్టీరాయిడ్స్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. స్టీరాయిడ్స్‌ హార్మోన్‌లలో ప్రధానమైనవి........ ఆండ్రోజెన్‌, ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టిన్‌ కాగా, వీటిలో ముఖ్యమైనవి టెస్టోస్టిరాన్‌, ఈస్ట్రాడియోల్‌. ప్రొజెస్టిరాన్‌లు.
శరీరంలోని గొనాడ్స్‌ గ్రంధులలో స్టీరాయిడ్స్‌ ఉత్పత్తవుతాయి. వృషణాలు, అండాశయాలు, ఎడ్రినల్‌ కార్టెక్స్‌(కిడ్నీలపై టోపీలవలె నుండు భాగాలు)ల్లో ఈ గ్రంధులు ఉంటాయి.

ఇక సెక్సు కార్యాలకు సంబందించిన పెప్టయిడ్‌ హార్మోన్‌లు ఏమిటంటే.....
గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌(జి.ఆర్‌.ఎన్‌.హెచ్‌), ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌, ప్రొలాక్టిన్‌, ల్యుటినైజింగ్‌ హార్మోన్‌, మరియు పోస్టీరియర్‌ పిట్యూటరీ నుండి వచ్చే ఆక్సిటోసిన్‌.
గొనడో ట్రోఫిన్‌ రిలీజింగ్‌ హార్మోన్‌ : మెదడు భాగంలోని హైపోథేలమస్‌లో తయారయ్యే ఈ హార్మోన్‌ టెస్టోస్టెరాన్‌ ఉత్పత్తి కోసం పిట్యూటరీ గ్రంధిని ప్రేరేపిస్తుంది.

ఫాలిక్యులార్‌ స్టిములేటింగ్‌ హార్మోన్‌ : మగవారిలో గ్రాఫియన్‌ ఫాలికిల్‌ పక్వమవడాన్ని ప్రేరేపిస్తుంది. వీర్యకణాల ఉత్పత్తి ప్రారంభదశలో వినియోగపడుతుంది.
ప్రొలాక్టిన్‌ : స్తనముల నుండి క్షీరం ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఈ హార్మోన్‌ ఎక్కువైతే బీజాలు, అండాశయాలకు సంబందించిన బాధలు కలుగుతాయి.

ల్యుటినైజింగ్‌ హార్మోన్‌ : ఇది 3 ప్రధానమైన విధులను నిర్వహిస్తుంది. 1.మగవారిలో బీజాల్లోని ఇంటర్‌ స్టేషియల్‌ కణాలను ప్రేరేపించి టెస్టాస్టెరోన్‌ హార్మోన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.
2.ఆడువారిలో కొలెస్ట్రాల్‌ నుండి ప్రొజెస్టిరాన్‌ హార్మోన్‌ తయారయ్యేట్టు చేస్తుంది.
3.బీజాలు లేదా అండాశయాలకు రక్తప్రసారం పెరిగేట్టు చేస్తుంది.

ఆక్సిటోసిన్‌ : 1. పిట్యూటరీ నుండి విడుదలయ్యే ఈ హార్మోన్‌ ప్రసవ సమయంలోగర్భాశయంలో కదలికలను ప్రేరేపిస్తుంది.
2. వక్షోజములలో పాల ఉత్పత్తికి తోడ్పడుతుంది.
3. బావప్రాప్తి దశలో రక్తంలోదీని పరిమాణం పెరగుతుంది.ఆ సమయంలో జననావయాలు తీవ్ర సంకోచాలకు లోనుకావటానికి కారణమిదే! స్కలనమైన అరగంట తర్వాత రక్తంలో దీని పరిమాణం సాధారణ స్థాయికి చేరుకొంటుంది.
కామోద్రేక ఉద్దీపనలో ఈ హార్మోన్‌ పాత్ర కూడా ఉందని ఇటీవలే పరిశోధకులు గుర్తించారు..........
(వచ్చే టపాలో మగ హార్మోనుల విశేషాల గురించి)

Saturday, July 11, 2009

సెక్సు హార్మోన్లు ..... కామరసాయనాలు

తల్లి గర్భంనుండి జన్మించిన శిశువు ఆడ అయినా, మగ అయినా ఒకేలా కనిపిస్తుంది. జననాంగమును చూసినప్పుడే లింగ భేదం తెలుస్తుంది. పెరుగుతున్న కొద్దీ వారిలో ఆయా లింగభేదము ననుసరించి శారీరకమైన మార్పులు(అంతర్గతమైన మానసిక, ప్రజ్ఞాపాటవ గుణగణాలు కూడా) చోటుచేసుకొంటాయి.యుక్త వయసు రాగానే ఆ మార్పులు మరింత బాగా ప్రస్ఫుటిస్తాయి.స్త్రీకి ఆకర్షణీయమైన శరీరం, కోమలమైన కంఠస్వరం, మగవారి మతులు పోగొట్టే ఎద ఎత్తులు, గమ్మతైన జఘనం, నాజూకైన నడక స్వంతం కాగా, పొడవుగా ఎదిగిన శరీరం, బలమైన కండరాలు, గడ్డాలూ మీసాలతో మగవారి యవ్వనం జివ్వుమంటుంది.

స్తీ పురుషులకు ఆయా రూపాలు ఏర్పడటానికీ, వారిలో కామోద్రేకం కలగడానికి కారణం వారిలో ఉత్పత్తయ్యే సెక్సు హార్మోన్‌లే. వీటి మూలంగానే వారిలో ఆయా ఆకర్షణీయమైన శారీరక మార్పులూ ఏర్పడుతున్నాయి.
శరీరంలోని ఒకచోట నున్న గ్రంధులలో ఉత్పత్తయ్యి , దూరంగా మరోచోటనున్న నిర్ధిష్ట అవయవాలపై ప్రభావం చూపించే రసాయనాలనే హార్మోనులంటారు. హార్మోన్‌ అన్నది గ్రీకు భాషా పదం. ఈ పదానికి అర్ధం ' నేను ఉత్తేజ పరుస్తా' అని. హార్మోనులను ఆయా అవయవాలకు చేర్చేందుకు ఈ గ్రంధులు నాళములను కలిగి ఉండవు. అందుకే వీటిని వినాళ గ్రంధులని అంటారు.

ఈ గ్రంధులలో తయారైన హార్మోనులు రక్తంలో నేరుగా కలిసి ఆయా అవయవాలను చేరుకొంటాయి. శరీర కణాలలో జీవకార్య నిర్వహణ ఈ హార్మోన్‌ల నియత్రణలోనే జరుగుతుంది. వేర్వేరు హార్మోన్‌లు శరీరంలో ఆయా ప్రధానమైన పనులను నిర్వర్తిస్తాయి.శరీరంలో ఈ హార్మోనుల పరిమాణం ఉండవలసిన స్థాయి కంటే ఎక్కువ ఉన్నా, లేదా తక్కువ ఉన్నా వ్యాధులు కలుగుతాయి. ఈ హార్మోనుల స్థాయిని నియంత్రించే వ్వవస్థను శరీరం సహజంగానే కలిగిఉంటుంది.