Monday, July 13, 2009

నపుంసకత్వం

నపుంసకత్వం........

సెక్సు హార్మోనుల ఉత్పత్తి అస్సలు లేకపోవటం మగవారిలో నపుంసకత్వానికి దారితీస్తుంది. ఫలితంగా పురుషాంగం, వృషణాలలో పెరుగుదల లోపించి చిన్న పిల్లల్లో మాదిరిగా కనిపిస్తాయి. ఉపలైంగిక లక్షణాలైన గడ్డాలు,మీసాలు, ఫ్యూబిక్‌ హెయిర్‌ తయారుకావు. జన్యుపరమైన లోపాలు (వారసత్వంగా సంక్రమించే దోషాలు), పుట్టుకతోనే వృషణాలలో ఏర్పడిన సమస్యలు, వృషణాలలో క్షయ రోగం వ్యాపించటం, గడ్డలు పెరగటం, గనేరియా, సిఫిలిస్‌ వంటి సుఖరోగాల ప్రభావం వలన వృషణాలు చైతన్య రహితంగా తయారు కావటం మొదలైన కారణాల మూలంగా సెక్సు హార్మోనుల ఉత్పత్తిని నిరోధింపబడి నపుంసకత్వం ప్రాప్తిస్తుంది.

కొంతమందిలో అరుదుగా చిన్న వయసులోనే ఈ సెక్సు హార్మోనులు(ముఖ్యంగా టెస్టాస్టిరోన్‌) అదుపుతప్పి అధికంగా ఉత్పత్తి కావటం జరుగుతుంది. అందువలన విచిత్రమైన పరిస్థితి వారిలో దాపురిస్తుంది. పురుషాంగం భారీగా తయారుకావటం, విపరీతమైన సెక్సు కోరికలు కలిగిఉండటం, పెద్దవారిలా ప్రవర్తించటం మొదలైన లక్షణాలు ఏర్పడతాయి. వీరిలో హార్మోనుల చికిత్స చేయించటం ద్వారా పరిస్థితిని సరిదిద్దవచ్చు!

మానసిక కారణాల వలన కూడా కొంతమంది నపుంసకులుగా తయారవుతారు.అతిగా హస్త్తప్రయోగం చేసుకోవటం వలన, రతి సామర్ధ్యం పోతుందని,అందువలన స్త్రీతో సంభోగానికి పనికిరాననే ఆధారం లేని భయాలు,అపోహలు కలిగిఉండటం, తన జననాంగం చిన్నదిగా ఉన్నదని..... అందుచేత స్త్రీని సుఖపెట్టలేనని భావించటం,
ఇతర సెక్సు పరమైన అంశాల పట్ల అవగాహనా రాహిత్యం మొదలైన కారణాల వలన శారీరకమైన లోపాలేవీ లేకపోయినప్పటికీ నపుంసకులుగా మారతారు. ఇటువంటి వారిలో కొంతమంది హస్తప్రయోగం చక్కగా చేసుకొంటారు, స్త్రీతో సంభోగం విషయంలో మాత్రం ఫెయిలవుతారు. తమది మానసిక లోపమే గాని, శారీరక సమస్య కాదని గ్రహించలేక బాధపడు తుంటారు. ఇటువంటి మానసిక సమస్యలకు సెక్సాలజిస్టుతో జరిపే కౌన్సిలింగ్‌ వలన సులభంగా పరిష్కారం దొరుకుతుంది.

No comments:

Post a Comment