Tuesday, July 14, 2009

ఆడ సెక్సు హార్మోనులు

female sex hormones .........

ఆడ సెక్సు హార్మోనుల్లో ప్రధానమైనది ఈస్ట్రోజెన్‌. ఇది అండాశయాలలో తయారవుతుంది. స్త్రీ రజస్వల అయ్యే
వయసులో ఈ హార్మోన్‌ ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

పిట్యూటరీ గ్రంధిలో తయారయ్యే గొనాడోట్రోఫిన్‌ రసాయనం అండాశయాలలోని ఈ హార్మోను ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఈ హార్మోను ప్రభావం వలన స్త్రీకి మర్మాంగం,చంకల్లో వెంట్రుకలు పెరగటం,మర్మాంగం దాని ఇతర భాగాలలో వికాసం, వక్షోజాలు వృద్ధి చెందడం మొదలైన శారీరక మార్పులు కలుగుతాయి.
కామపరమైన ఊహలూ, వాంఛలూ పెరుగుతాయి.

ఈ హార్మోనుల ఉత్పత్తి జరగకపోతే ఆడపిల్ల రజస్వల కాలేదు. యోని, వక్షోజాలు వికాసం చెందకుండా చిన్నవిగానే ఉండిపోతాయి. ఆమెలో సెక్సు కోరికలు కూడా ఉండవు.

మగవారి మూత్రపిండాలలో ఆడ సెక్సు హార్మోన్‌లు తయారైనట్టుగా, ఆడువారిలోనూ మగసెక్సు హార్మోన్‌ల(వీటిలో ప్రధానమైనది టెస్టాస్టిరోన్‌) ఉత్పత్తి జరుగుతుంది. ఇవి మూత్రపిండాలపై ఉండే ఎడ్రినల్‌ కార్టెక్స్‌లో తయారవుతాయి. ఏదేనీ కారణంగా ఎడ్రినల్‌ కార్టెక్స్‌లో ఈ హార్మోనులు అధికంగా విడుదలైతే మాత్రం వారిలో పురుష లక్షణాలు మొగ్గ తొడుగుతాయి.కండలతో కూడిన శరీరము,గంభీరమైన స్వరం, ఒంటినిండా వెంట్రుకలతో మగరాయుడిలా కనిపిస్తారు.

No comments:

Post a Comment